ఫౌజీ లో ప్రభాస్ అమ్మ పాత్రలో సీనియర్ నటి
Jaya Prada to Play Prabhas' Mother in Fauzi
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఫౌజీ. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026 న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఫౌజీ రీలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ మాసివ్ గా అభిమానులను సర్ ప్రైజ్ చేసారు.
ఈ చిత్రంలో సీనియర్ నటి జయప్రద నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఫౌజీ సెట్ లోకి ఎంటర్ అయిన జయప్రద ప్రభాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు వలె ప్రభాస్ కూడా తోటివారికి సహాయం చేయడంలో ముందుంటారని, సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ చూపించే ఆప్యాయత, వినయం ఎంతో ప్రత్యేకమైనవని ఆమె ప్రశంసించారు.
అయితే జయప్రద ఫౌజీ లో ప్రభాస్ కి తల్లిగా కనిపించనున్నారట. ప్రస్తుతం ప్రభాస్-జయప్రద కలయికలో కీలక సన్నివేశాలను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా తొలిసారి పరిచయమవుతుంది.








































