మహేష్, అల్లు అర్జున్ ఇప్పుడు ఎన్టీఆర్
After Mahesh and Allu Arjun, Now Jr NTR?
సూపర్ స్టార్ మహేష్ ఎప్పుడో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. హైదరాబాద్ లో AMB మాల్ ని సూపర్ స్టార్ మహేష్ ఎప్పుడో మల్టీప్లెక్స్ రంగంలోకి వెళ్లారు. రీసెంట్ గా బెంగుళూరులో కూడా AMB థియేటర్ ఓపెన్ చేసారు. అల్లు అర్జున్ కూడా ఈ మల్టీప్లెక్స్ రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో సత్యం థియేటర్ స్థానే AAA, కోకాపేట లో అల్లు సినిమాస్ అలాగే వైజాగ్ లోను మరో థియేటర్ రూపుదిద్దుకుంటుంది.
అలాగే రవితేజ కూడా మల్టిప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి లో ఎన్టీఆర్ మల్టీప్లెక్స్ కట్టబోతున్నారని అంటున్నారు.
ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ సైలెంట్ గా ఉంటున్నారు తప్ప ఏ ఇతర వ్యాపారాలు చేసిన దాఖలాలు లేవు .కానీ ఎన్టీఆర్ ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది.








































