రామాయణ: నార్త్ వాళ్లకు ఎందుకింత మంట
Sai Pallavi as Sita: Trolls Vs Emotional Support
నార్త్ వాళ్లకు కొన్నేళ్లుగా సౌత్ వాళ్లంటే మంట కింద ఉంది. ఆడియన్స్ ఎలా ఉన్నా బాలీవుడ్ లో కొంతమంది సౌత్ ని చిన్న చూపు చూసేవాళ్లకు పాన్ ఇండియా మూవీస్ అంటూ సౌత్ వాళ్ళు గట్టిగా సమాధానమిచ్చారు. దానితో వాళ్ళ చిన్న చూపు స్థానంలో అసూయ మొదలైంది. అందుకే సౌత్ హీరోలు, హీరోయిన్స్ బాలీవుడ్ లో కనిపిస్తే వారి కడుపు మంట తో నెగిటివిటి స్ప్రెడ్ చేస్తున్నారు.
మొన్నామధ్యన రష్మిక, కృతి సనన్ లు కాక్ టైల్ 2 లో కనిపించిన తీరు ఒకేలా ఉన్నా కృతి సనన్ ని పొగుడుతూ రశ్మికపై ట్రోల్స్ చేశారు. ఇప్పడు రామాయణ చిత్ర ట్రైలర్ చూసి సీత గా సాయి పల్లవి అస్సలు బాలేదు. ఓన్ డబ్బింగ్ బాలేదు, సాయి పల్లవి మరీ చిన్న పిల్లలా ఉంది, ఆమె మొహం లో శాంతం లేదు, ఆమె ఫేస్ సీత గా సూట్ కాలేదు, ఆమె లుక్స్ బాలేదు అంటూ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
సీత గా సాయి పల్లవి చాలా బావుంది, ఆమె లుక్స్ సూపర్బ్, ఇన్నోసెంట్ ఫేస్ అన్ని ఆకట్టుకున్నాయి అని సౌత్ వాళ్ళు పోగుడుతుంటే నార్త్ వాళ్ళు మాత్రం సాయి పల్లవి సీత కేరెక్టర్ కు సూట్ కాలేదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దానితో సౌత్ ఆడియన్స్ నార్త్ ని టార్గెట్ చేస్తూ అవును సీత పాత్రలో బికినీ వేసుకునే అలియా భట్ ని కానీ, లేదంటే దీపికా ను కానీ, కాదు అంటే కియారా ను కానీ పెట్టాల్సింది.
వాళ్ళు సీత గా సూట్ అయ్యేవారు, అప్పుడు నార్త్ వాళ్లకు బావుండేది, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఆ పాత్రకు అంత వన్నె తెస్తే.. అంటూ సాయి పల్లవి కి సపోర్ట్ గా సౌత్ ఆడియన్స్ ట్రోల్స్ పై మండిపడుతున్నారు.








































