వారణాసి - 250 డేస్ టార్గెట్
Varanasi - 250-Days Target
దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం వారణాసి షూటింగ్ ఫుల్ స్పీడులో జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాస్ట్లీ సెట్ లో వారణాసి షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే రాజమౌళి ఓ 80 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అంటూ బిగ్ అప్ డేట్ ఇచ్చారు.
ఇప్పుడు వచ్చే ఏడాది అంటే 2027 ఏప్రిల్ 7 న వారణాసి రిలీజ్ పక్కా అంటూ వారణాసి నుంచి క్రేజీ అప్ డేట్ వదిలారు. 250 days to APRIL 7th. #Varanasi అంటూ వారణాసి X అఫీషియల్ హ్యాండిల్ నుంచి అప్ డేట్ పడగానే మహేష్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతూ పండగ చేసుకుంటున్నారు.
మరి రాజమౌళి సూపర్ స్టార్ మహేష్, ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ లతో వారణాసి షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. రుద్రగా మహేష్, మందాకినిగా ప్రియాంక, కుంభ గా పృథ్వీరాజ్ లు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఆగష్టు 9 మహేష్ బర్త్ డే కి వారణాసి స్పెషల్ గ్లింప్స్ ని రాజమౌళి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.








































