Advertisement

అల్లు అర్జున్ : ఇది ఎవరికి సాధ్యం కాదు

Allu Arjun


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్లానింగ్ ఎవరికీ సాధ్యం కాదు.. ఇదే గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్. కొద్దిరోజులుగా టాలీవుడ్ హీరోలు వరసగా ప్రమాదాల బారిన పడి సోషల్ మీడియాలో హైలెట్ అయ్యారు. పవన్ భుజానికి సర్జరీ, బాలయ్య మోకాలి సర్జరీ, రామ్ చరణ్ మణికట్టు సర్జరీ, ఎన్టీఆర్ భుజానికి గాయం ఇలా సోషల్ మీడియా మొత్తం హీరోలు, వారి ప్రమాదాలు, హాస్పిటల్స్ అంటూ హైలెట్ అవుతున్నారు.

కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ పెట్టి, వారిలో కొంతమందికి ఇన్సూరెన్స్ చేయించి ఒక్కసారిగా అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకున్నారు. ఆయన పెట్టిన ఫ్యాన్స్ మీట్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అవుతుందో అందరూ చూస్తున్నారు. అల్లు అర్జున్ ప్లానింగ్ గురించి ఇండస్ట్రీనే కాదు నెటిజెన్స్ కూడా పొగిడేస్తున్నారు.

అల్లు అర్జున్ ఎవరికి సాధ్యం కానిది చేసి చూపిస్తున్నారు. అటెన్షన్ క్రియేట్ చేసుకోవడంలో అల్లు అర్జున్ కు ఎవరూ సాటి రారు. ఎక్కడో అట్లీ సినిమా రాకా షూటింగ్ చేసుకుంటూ కామ్ గా ఉంటూ, మధ్యలో ఇలా ఫ్యాన్స్ మీట్ అంటూ హైలెట్ అవడం, అందరి అటెన్షన్ తనపైనే ఉండేలా చూసుకోవడం అన్ని ఆయనకే సొంతం. ఇదే అల్లు ఫ్యాన్స్ అభిప్రాయం.

Icon Star Allu Arjun