సీఎం విజయ్ కి ఎదురు దెబ్బ
Madras HC cancels Vijay govt's jobs order for Karur stampede victims families
తమిళనాడులో టీవీకే పార్టీ ఏర్పాటు చేసిన కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో విజయ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆతర్వాత విజయ్ సీఎం అయ్యాక వారి కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చెయ్యడమే కాకుండా కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ సీఎం హోదాలో ఉద్యోగ నియామక పత్రాలను బాధిత కుటుంబాలకు అందజేశారు.
అయితే కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని 14, 16 అధికరణాలకు ఈ నియామకాలు విరుద్ధమని పేర్కొంటూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పరిహారంగా నష్ట పరిహారం ఇవ్వాలె కానీ.. ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వలేరు. కారణం ఇప్పటికే కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి, విధి నిర్వహణలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అన్యాయం చేయడమే అవుతుంది అంటూ కోర్టు సీఎం విజయ్ కి షాకిచ్చింది.
ఇక సీఎం విజయ్ అందించిన ఉద్యోగ పత్రాలతో ఇప్పటికే బాధిత కుటుంబాలకు చెందిన వారు విధుల్లో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు సీఎం విజయ్ కి విరుద్ధంగా రావడంతో వారి నియామకాలు ఆగిపోయాయి.







































