రవితేజ వెనక్కి తగ్గుతున్నారా
Is Irumudi backing off
మాస్ మహారాజ్ రవితేజ వరసగా నిరాశపరిచే సినిమాలు చెయ్యడంతో ఆయన ఫ్యాన్స్ డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు. క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తున్నా రవితేజ కు ధమాకా తర్వాత అంత పెద్ద హిట్టు దొరకలేదు. ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా సో సో అనిపించింది. సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఇరుముడి అయినా రిలీఫ్ నిస్తుంది అని భావిస్తున్నారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇరుముడి చిత్రం ఆగష్టు 21 రిలీజ్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఆతర్వాత ఓ సాంగ్ రిలీజ్ చేసారు, టీజర్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇరుముడి మేకర్స్ చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. ఇరుముడి విడుదలకు 20 రోజుల సమయమే ఉంది. కానీ ప్రమోషన్స్ మొదలు కాలేదు.
దానితో రవితేజ వెనక్కి తగ్గుతున్నారేమో, అందుకే ఇరుముడి ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యలేదా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి రవితేజ ఇరుముడి వాయిదా పడితే మేకర్స్ దానిని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే ఏ కన్ఫ్యూజన్ ఉండదు.







































