డ్రాగన్ సెట్ లో ఎన్టీఆర్ కు గాయం

Jr NTR suffered a shoulder injury

 

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు సినిమా షూటింగ్స్ లో వరసగా ప్రమాదాల బారిన పడి గాయపడుతున్నారు. వరుణ్ తేజ్, ఆతర్వాత పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, నిన్నగాక మొన్న NBK 111 సెట్ లో బాలయ్య, ఆల్రెడీ భుజాల గాయాలతో పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకోవడం ఇలా టాలీవుడ్ హీరోలంతా గాయాల పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇప్పుడు ఈ కోవలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరారు. ఈరోజు సోమవారం సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది, గాయపడిన తర్వాత ఆయనకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఎన్టీఆర్ టీమ్ ఒక అధికారిక ప్రకటన చేసింది. దీనివల్ల ఆయన ఆరు నుండి ఎనిమిది వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులను ఆందోళనకు గురిచేసింది, చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ అంశానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో ఎప్పటికప్పుడు అందిస్తామని ఎన్టీఆర్ టీమ్ ప్రకటించింది. 
 

NTR sustains an unfortunate shoulder injury