చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ వీకెండ్ లెక్కలు
Chennai Love Story first weekend collections
కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ తో మరో హిట్ కొట్టేసాడు. హీరోగా ప్రత్యేకత చూపిస్తూ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ తో డీసెంట్ హిట్ అందుకున్నాడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి సెకండ్ హాఫ్ కూడా బావున్నట్టయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.
కానీ సెకండ్ హాఫ్ వీక్ గా ఉండడంతో చెన్నై లవ్ స్టోరీకి జస్ట్ హిట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి చెన్నై లవ్ స్టోరీ వరల్డ్ వైడ్ గా రూ.40.1 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినట్లుగా మేకర్స్ పోస్టర్ వేసి మరీ అధికారికంగా ప్రకటించారు.
మరి కిరణ్ అబ్బవరం ఖాతాలో చెన్నై లవ్ స్టోరీ రూ.50 కోట్ల క్లబ్బులోకి చేరిపోవడం ఖాయమనేలా వీకెండ్ కలెక్షన్స్ ఉన్నాయి. చూద్దాం చెన్నై లవ్ స్టోరీ ఫైనల్ రన్ లో ఎన్ని కలెక్షన్స్ తీసుకొస్తుందో, నిర్మాతలకు ఎంత లాభాలు కట్టబెడుతుందో చూద్దాం.







































