పూరి జగన్నాధ్ ఇంట్లో తీవ్ర విషాదం
Puri Jagannadh's Mother Dies At 96
దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పూరి జగన్నాథ్ తల్లి కన్నుమూయడంతో పూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పూరి జగన్నాథ్ తల్లి కన్నుమూసిన విషయాన్ని పూరి కుమార్తె పవిత్ర సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది.
నాన్నమ్మతో తనకున్న బాండింగ్ ని గుర్తు చేసుకుంటూ పవిత్ర ఆ పోస్టు పెట్టింది. ఇకపై నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు.. ప్రేమగా నాకెవరు ముద్దుపెడతారు.. నాన్నమ్మా నీతో మరో రోజు గడిపే అవకాశం వస్తే ఎంత బాగుండేది. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లే మరోసారి పెద్ద హగ్ ఇస్తా, ఐ మిస్ యూ నానమ్మ అంటూ పవిత్ర నాన్నమ్మ తో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుకుంది.
ఇక పూరి జగన్నాథ్ కి మాతృ వియోగం కలగడంతో సినీ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు సానుభూతిని తెలుపుతున్నారు.
Puri Jagannadh's Mother Passes Away







































