Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akhil's first reaction to the result of Agent

ఏజెంట్ రిజల్ట్ పై అఖిల్ ఫస్ట్ రియాక్షన్

Akhil's first reaction to the result of Agent

 

అక్కినేని అఖిల్ తాజా చిత్రం లెనిన్ రూ.100 కోట్ల టార్గెట్ గా థియేటర్స్ లో రన్ అవుతుంది. మూడో వారంలో అడుగుపెట్టిన లెనిన్ చిత్రాన్ని అఖిల్ కన్నా ఎక్కువగా అక్కినేని నాగార్జున చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చిన్న కొడుకుకి హిట్టు ని కట్టబెట్టారు. లెనిన్ తో అఖిల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు.

లెనిన్ కి ముందు అఖిల్ ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ తో సతమతమయ్యాడు. ఏజెంట్ రిజల్ట్ తర్వాత అఖిల్ ఆ సినిమాపై ఎక్కడా స్పందించలేదు. అసలు మీడియా ముందు రాలేదు. ఆఖరికి లెనిన్ ప్రమోషన్స్ లోను ఏజెంట్ ప్లాప్ విషయాలపై మాట్లాడలేదు. తాజాగా ఏజెంట్ పై అఖిల్ ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు.

ఏజెంట్ ప్లాప్ తనని చాలా ఇబ్బంది పెట్టింది, ఆ సినిమాలో నన్ను నేను చూసుకుని అస్యహించుకున్నాను, ప్రతి సన్నివేశంలో నేను చాలా ఓవర్ గా పెర్ఫార్స్ చేశానని నాకే అనిపించింది. సినిమా విడుదలయ్యాక మరోసారి సినిమా చూసి చాలా డిజప్పాయింట్ అయ్యాను, ఫస్ట్ కాపీ చూడగానే డౌట్ కొట్టింది అంటూ అఖిల్ ఓ ఇంటర్వ్యూలో ఏజెంట్ ప్లాప్ పై రియాక్ట్ అయ్యాడు. 

Akhil-Agent