Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Cockroach's Victory – Dharmendra Pradhan's Resignation

కాక్రోచ్ విజయం-ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Cockroach's Victory – Dharmendra Pradhan's Resignation


నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేఖంగా కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద నెల రోజుల క్రితం మొదలైన ఆందోళనలు CJP ఎట్టఎకేలకు విరమించారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని, నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు సహాయం చెయ్యాలనే ప్రధాన డిమాండ్ తో CJP నిరసనలు చేపట్టింది.

విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న నిరవధిక నిరాహార దీక్షలో చేరడంతో ఈ ఉద్యమం విస్తృతమైంది, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికా నుంచి వచ్చి మరీ ఈ ఆందోళనలో పాల్గొన్నాడు. మరోపక్క విపక్షాలు సపోర్ట్ CJP కి లభించి ఢిల్లీ లో ఆందోళనలు ఆకాశాన్నంటాయి.

విపక్షాల ఒత్తిడి, CJP నిరసన ల నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. ఇది యువత విజయం, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాని తమ పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామా పై కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామని, ప్రజాస్వామ్యం గెలిచిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. 

India's education minister resigns after mass protests by Cockroach movement