స్పిరిట్ లో క్యాట్ నే దించుతున్నారా?
Katrina Kaif In Spirit
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `స్పిరిట్`. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆపాత్ర కు జోడీగా హాట్బ్యూటీ త్రిప్తీ డిమ్రీ నటిస్తోంది. వాస్తవానికి ఆ పాత్రలో దీపికా పదుకొణే నటించాలి. కానీ దర్శకుడితో తలెత్తిన విబేధాలు కారణంగా దీపిక ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఎంట్రీపై ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కథను మలుపు తిప్పే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం. సందీప్ రెడ్డి వంగా చిత్రాల్లో ఊహించని పాత్రలు, షాకింగ్ ట్విస్టులు పెట్టడంలో దిట్ట కావడంతో కత్రినా కైఫ్ పాత్ర సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందనొచ్చు.
అయితే క్యాట్ ఎంపికపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. బాలీవుడ్ మీడియాలో తీసుకుంటున్నారు? అనే వార్త తప్ప క్లారిటీ లేదు. సందీప్ కాస్టింగ్ విషయంలో రాజీ పడరు. పాత్రల ఎంపిక విషయంలో సందీప్ స్టార్ డమ్ కంటే? తాను రాసిన పాత్రకు ఏ నటి అయితే సెట్ అవుతుందో? చూసుకుని స్టార్ డమ్ తో పనిలేకుండా ఎంపిక చేస్తారు.
అలాంటింది `స్పిరిట్` చిత్రంలో కత్రినాపై కన్ను పడిందంటే? పాత్ర ప్రాధన్యత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ వార్తలు నిజమైతే రెండు దశాబ్దాల తర్వాత కత్రినా కైఫ్ మళ్లీ టాలీవుడ్ తెరపై కనిపించనున్నారు. కత్రినా మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.








































