టాక్సిక్ కన్నా రామాయణకే క్రేజ్
Toxic vs Ramayana
కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేసిన టాక్సిక్ చిత్రానికన్నా ఆయన విలన్ గా రావణ్ పాత్రలో నటించిన రామాయణపైనే ఫుల్ క్రేజ్ కనిపిస్తుంది. రావణ్ గా యష్ లుక్స్ కానివ్వండి, ఆ రావణ్ రోల్ కానివ్వండి అన్ని యష్ ని హైలెట్ చేస్తున్నాయి. టాక్సిక్ చిత్రంలో యష్ ని చూస్తే కెజిఎఫ్ లో యష్ ని చూస్తున్నట్టే ఉంది అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పటివరకు టాక్సిక్ నుంచి వచ్చిన కంటెంట్ చూసి ఇదేదో బోల్డ్ మూవీలా ఉంది అని ఆడియన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఈ చిత్రం పెద్దవాళ్లకు మాత్రమే అని టాక్సిక్ నిర్మాత చెప్పేసారు. మరోపక్క రామాయణ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వీక్షించే పురాణం గాధ.
మరోపక్క హీరో విలన్ అవతారం అందులోను రావణ్ గెటప్ అంటే మరికాస్త క్రేజు. అందుకే టాక్సిక్ కన్నా యష్ నటించిన రామాయణ పైనే క్రేజ్ కనిపిస్తుంది. యష్ టాక్సిక్ ప్రమోషన్స్ కన్నా ఎక్కువగా రామాయణ ప్రమోషన్స్ లోనే హైలెట్ అవుతున్నారు. టాక్సిక్ ఆగష్టు లో విడుదలవుతుంటే.. రామాయణ నవంబర్ లో దివాళి కి విడుదల కాబోతుంది.








































