కష్టానికి ప్రతిఫలం దక్కినట్టేనా?
Hero Kiran Abbavaram
నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసాక స్క్రీన్ పైనే కాదు, ప్రమోషన్స్ లోను కష్టపడుతూ ప్రత్యేకతను చూపిస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కి కెరీర్ లో బెస్ట్ సినిమాగా చెప్పుకోవడానికి, నటుడిగా ప్రేక్షకులకు పూర్తిగా పరిచయమైన చిత్రం క. ఆతర్వాత వచ్చిన K ర్యాంప్ కూడా యావరేజ్ మూవీ గానే మిలిగిలిపోయింది.
ఎలాంటి బ్యాక్ రౌండ్ లేకపోయినా, నటుడిగా తానేమిటో ప్రూవ్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో పేరున్న ప్రముఖుల బలమైన సపోర్ట్ తో వరస సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరానికీ కంప్లీట్ హిట్ పడడం లేదు. తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీ కూడా కిరణ్ అబ్బవరానికి ఫుల్ ఫిల్ హిట్ ఇవ్వలేదు.
క్రిటిక్స్ నుంచి 3 రేటింగ్ తెచ్చుకోలేకపోయిన చెన్నై లవ్ స్టోరీ కి రివ్యూ రైటర్స్ అంతా ఎబోవ్ యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు. స్టోరీ పరంగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియా డామినేషన్ తట్టుకుని కిరణ్ అబ్బవరం చూపించిన పెరఫార్మెన్స్ కి క్లాప్స్ పడాల్సిందే. ఎనర్జిటిక్ రోల్ స్టీవెన్ శంకర్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటుడిగా నిరూపించుకున్నాడు.
చెన్నై లవ్ స్టోరీ లో ఫస్ట్ హాఫ్ లో ఉన్న జోష్ సెకండ్ హాఫ్ లోను కంటిన్యూ అయినట్లయితే అబ్బవరం శ్రమకు పర్ఫెక్ట్ ఫలితం దక్కి ఉండేది. కంప్లీట్ సక్సెస్ వచ్చేది. కానీ ఆ సెకండ్ హాఫ్ చెన్నై లవ్ స్టోరీని వీక్ చేసేసింది, అబ్బవరం కలలపై నీళ్లు చల్లేసింది.








































