శోభితను ఆటపట్టించిన చైతు
Naga Chaitanya's Funny Take on Sobhita's Cooking
రెండేళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత లు కెరీర్ దృష్యా ఒకరు హైదరాబాద్, మరొకరు ముంబై లో ఉంటున్నారు. ఎవరకు వీలు దొరికినా హైదరాబాద్ లో కలిసి స్పెండ్ చేసే ఈ యువ జంట తాజాగా వార్తల్లో నిలిచింది.
నాగ చైతన్య కోసం శోభిత వంట చేసింది. భార్య అన్నాక భర్తకు వంట చేసి పెడుతుంది ఇందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ నాగ చైతన్య చేసిన ట్వీట్ చూస్తే మాత్రం నవ్వొస్తుంది. పెళ్లయిన దాదాపు రెండేళ్లకు నా భార్య నా కోసం వంట చేసింది. బహుశా.. ఈ రోజు నేను ఏదో మంచి పనే చేసి ఉంటాను అంటూ చైతు శోభితా మండుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అది చూసిన శోభిత చైతు ట్వీట్ కి రిప్లై స్టయే..నువ్వు నన్ను ట్రోల్ చేస్తున్నావా.. లేక పొగుడుతున్నావా అంటూ ఫన్నీ ఎమోజీని జోడించింది. ప్రస్తుతం ఈ భార్య భర్తల ట్వీట్లని అక్కినేని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.








































