రామాయణ ప్రమోషన్స్ కు షాకింగ్ బడ్జెట్
Shocking budget for Ramayana promotions.
రూ.4000 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రం రెండు భాగాలుగా రూపు దిద్దుకుంటుంది. మొదటి భాగం ఈ ఏడాది నవంబర్ లో దివాళి కి విడుదల కాబోతుంది. ప్రస్తుతం రామాయణ చిత్రాన్ని ఫుల్ గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ రంగంలోకి దిగారు. రాముడు పాత్రధారి రణబీర్ కపూర్, సీత పాత్రధారి సాయి పల్లవి, రావణ్ పాత్రధారి యష్ అలాగే కీలక పాత్రధారులు రామాయణ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
అయితే తాజాగా రామాయణ ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం మేకర్స్ ఏకంగా రూ.375 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నారనే న్యూస్ సంచలనంగా మారింది. రామాయణ ప్రమోషన్స్ కోసమే రూ.375 కోట్ల బడ్జెట్ కేటాయించడం అంటే వినడానికే షాకింగ్ గా అనిపించడం లేదు. ఇప్పటికే ఢిల్లీ లో రామాయణ 3D ట్రైలర్ లాంచ్ చేసారు.
ఇకపై హాలీవుడ్ రేంజ్ లో రామాయణను టీమ్ ప్రమోట్ చేయబోతుంది అని తెలుస్తుంది. నిన్న రావాల్సిన రామాయణ ట్రైలర్ పోస్ట్ పోన్ అయ్యింది. మరి రామాయణ ప్రమోషన్స్ కి ఆ రేంజ్ బడ్జెట్ అంటే ఇంకెన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తారో అనేది ఆసక్తిగా మారింది.








































