రీల్ శ్రీరాముడికి అత‌డే రాముడిగా స్పూర్తి!

Ranbir Kapoor credits Arun Govil

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం`లో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్న రణబీర్ కపూర్ ఆ పాత్ర కోసం తన సిద్ధాంతాన్ని ఏ విధంగా మలచుకున్నారో ? వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ప్రథమ్ సంకల్ప్ వేడుకలో రణబీర్ మాట్లాడుతూ తన చిన్నతనం నుండి శ్రీరాముడిని ఎలా ఊహించుకున్నారో? అందులో పాతతరం రాముడు అరుణ్ గోవిల్ పాత్ర ఎంత ఉందో తెలియజేశారు. రామానంద సాగర్ రామాయణం సీరియల్ ద్వారా అరుణ్ గోవిల్ సృష్టించిన ప్రతిష్టను, ఆ పాత్రకు ఆయన ఇచ్చిన గౌరవాన్ని రణబీర్ కొనియాడారు.

`నేను చిన్నప్పటి నుండి శ్రీరాముడి ఆశీస్సులతో పాటు, మీ ముఖాన్ని మనసులో ఉంచుకుని పెరిగాను. ఆ పాత్రలో మీరు చూపిన హుందాతనం, నిజాయితీ నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. నా కష్టంలో కొంచెం కూడా మీలాంటి భక్తిని, కాలానుగుణమైన ఆత్మను ప్రతిబింబించగలిగితే నా నటన సఫలమైనట్లే అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

ఇదే  సినిమాలో అరుణ్ గోవిల్ దశరథ మహారాజు పాత్రలో కనిపించనుండటం విశేషం.  ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మొద‌టి భాగాన్ని ఇదే ఏడాది ...రెండ‌వ భాగాన్ని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. రిలీజ్ అనంత‌రం ఈ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.  ఈ చిత్రానికి హన్సిమ్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం  అందించ‌డం విశేషం.

Ranbir Kapoor credits Arun Govil for shaping his vision of Lord Rama in Ramayana