చరణ్ ని చూడాలంటె మరో రెండేళ్లు ఆగాలి

RC 17 UpdateRC 17 Update

 

పెద్ది తో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూడాలి అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందేనా..? అంటే సుకుమార్ తో సినిమా గనక ఆగాల్సిందే అనే మాటే వినిపిస్తుంది. పెద్ది చిత్రం తర్వాత రామ్ చరణ్ కాస్త బ్రేక్ తీసుకున్నారు.. సుకుమార్ పుష్ప తర్వాత RC17 కోసం ప్రిపేర్ అవుతూనే ఉన్నారు.

పుష్ప బ్లాక్ బస్టర్ హ్యాంగోవర్ నుంచి ఆయన బయటకి రావడానికి ఛానళ్ళే పట్టింది. ఆతర్వాత RC17 స్టోరీ రాసి చరణ్ ని ఒప్పించారు. కానీ దానిని డెవలప్ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా చరణ్ అందుబాటులోకి వచ్చినా సుకుమార్ పర్ఫెక్షన్ కారణంగా ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్ లో కానీ పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

అలా అయితే ఏడాదిన్నర పైనే షూటింగ్, ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కలిపి RC17 2028 సమ్మర్ వెళ్లే ఛాన్స్ ఉంది. సుకుమార్ షూటింగ్ అయినా, పోస్ట్ ప్రొడక్షన్ అయినా చాలా కూల్ గా పర్ఫెక్షన్ వచ్చేవరకు నిద్రపోరు. సో రామ్ చరణ్ ని మళ్లీ పాన్ ఇండియా రేంజ్ లో చూడాలి అంటే రెండేళ్లు మెగా ఫ్యాన్స్ వెయిట్ చెయ్యాల్సిందే. 

Ram Charan And Sukumar Upate