ప్రభాస్ స్పిరిట్ స్టోరీ రివీల్

Prabhas's Spirit story revealed


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కలయికలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న స్పిరిట్ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కి సంబందించిన చాలా విషయాలు ఎప్పుడో రివీల్ చేసేసారు.

తాజాగా స్పిరిట్ స్టోరీ లైన్ పై ఓ న్యూస్ క్రేజీగా చక్కర్లు కొడుతోంది. స్పిరిట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ పాత్ర డీల్ చేస్తున్న ఓ కేసు వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ లో రివీల్ అవుతుందని.. అంతేకాకుండా ప్రభాస్ పాత్రకు సంబందించిన వ్యక్తిగత జీవితానికి, హీరో వెతుకుతున్న విలన్ కి మధ్య బలమైన కనెక్షన్ కి సంబంధించిన ట్విస్ట్ అని తెలుస్తోంది.

ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఫౌజీ సెట్ పైకి వెళుతున్నారు. ఆతర్వాత నిరంతరాయంగా స్పిరిట్ షూటింగ్ ని ప్రభాస్ చుట్టేస్తారు. వచ్చే ఏడాది మార్చ్ లో స్పిరిట్ విడుదలకు సందీప్ ఎప్పుడో ప్లాన్ చేసారు.

Prabhas's Spirit update