ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Annu Kapoor criticized Nitesh Tiwari's Ramayana

రామాయణ-సాయి పల్లవి పాత్రపై తీవ్ర విమర్శలు

Annu Kapoor criticized Nitesh Tiwari's Ramayana

 

బాలీవుడ్ లో నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రానికి సంబందించిన 3D ట్రైలర్ ని ఢిల్లీ వేదికగా రివీల్ చేసారు మేకర్స్. రాముడిగా కూల్ లుక్స్ లో రణబీర్ కపూర్, సీత గా సాయి పల్లవి, రావణ్ గా యష్ ఆకట్టుకున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఎంతో గొప్పగానే నిర్వహించారు.

అయితే రీసెంట్ గా రామాయణ, ముఖ్యంగా సీత పాత్రధారి సాయి పల్లవి పై బాలీవుడ్ నటుడు అను కపూర్ తీవ్ర విమర్శలు చేసారు. ఆయన మాట్లాడుతూ.. రామాయణం అనేది ఒక పవిత్రమైన ఇతిహాసం, అలాంటి ఇతిహాసాన్ని తెరపైకి తీసుకురావడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. టెక్నీకల్ గా అంటే VFX పరంగా సినిమాని ఎంత గొప్పగా తీసినా, ప్రేక్షకులు ముందుగా గమనించేది పాత్రలకు ఎంపిక చేసిన నటీనటులే.

భారతీయులు సీతామాతను తల్లిగా, శ్రీరాముడిని దైవస్వరూపుడిగా భావిస్తారని, అలాంటిది సాయి పల్లవి ని సీత పాత్రకు ఎలా ఎంపిక చేసారంటూ ఆయన మండిపడ్డారు. పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తున్నారనేది ప్రేక్షకులు క్షుణంగా పరిశీలిస్తారు, అయితే సినిమా విడుదలయ్యాకే దాని గురించి పూర్తి స్థాయిలో మాట్లాడతానని అన్నారు.

అయితే ఆయన ప్రత్యేకించి సాయి పల్లవి ని సీత గా ఎందుకు ఎంపిక చేసారంటూ మాట్లాడడం చూసి సౌత్ హీరోయిన్, అందులోను నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి సీత పాత్రకు ఎందుకు సరిపోదు. ఎందుకు ఆమెపై అంత కడుపు అంటా అంటూ సౌత్ ప్రేక్షకులు మండిపడిపడుతున్నారు. 

Annu Kapoor criticized Sai Pallavi's casting as Sita