మళ్లీ భయం గుప్పిట్లో బాలీవుడ్!
Aamir Khan receives alleged threat in Lawrence Bishnoi gang nameబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపు వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఇలాంటి హెచ్చరికలు రావడం ఇదే మొదటిసారి కాదు. కానీ అమీర్ ఖాన్ వంటి అగ్రశ్రేణి నటుడి పేరు తెరపైకి రావడం భద్రతా పరమైన ఆందోళనలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. బెదిరింపుల వెనుక ఉన్న వాస్తవాలను, తీవ్రతను అంచనా వేసేందుకు వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
గత కొంతకాలంగా బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ల జోక్యం.. ప్రముఖుల భద్రత విషయంలో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటుచేసుకోవడం పరిశ్రమలో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. గతంలో కూడా పలువురు నటులు, నిర్మాతలు ఇలాంటి బెదిరింపులను ఎదుర్కోవడం దానిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం తెలిసిందే. అయితే ప్రతిసారీ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు స్టార్ హీరోల వ్యక్తిగత భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం అమీర్ ఖాన్ మాత్రమే కాదు. ఇతర స్టార్ల భద్రతా ఏర్పాట్లపై కూడా పోలీసులు పునసమీక్ష చేస్తున్నారు.
పోలీసు యంత్రాంగం ఈ కేసును అత్యంత తీవ్రంగా తీసుకుంది. బెదిరింపు కాల్స్ లేదా సందేశాల మూలాలను గుర్తించడం నిందితులు ఎక్కడి నుండి వీటిని పంపుతున్నారో? తెలుసుకోవడానికి సైబర్ సెల్ విభాగం నిరంతరం పని చేస్తోంది. ఇలాంటి బెదిరింపులు కేవలం భయాందోళనలు సృష్టించే ఉద్దేశంతో చేస్తున్నవేనా లేక నిజంగానే ముప్పు ఉందా అన్న కోణంలో విచారణ సాగుతోంది. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.
పరిశ్రమలో నటుడు పనిపై దృష్టి పెట్టాలంటే ప్రశాంతమైన వాతావరణం, భద్రత కల్పించడం అత్యంత అవసరం. ఇలాంటి సంఘటనలు కళాకారుల సృజనాత్మకతపై ప్రభావం చూపుతాయి. బెదిరింపుల వల్ల వారి వ్యక్తిగత జీవితం .. వృత్తిపరమైన కార్యకలాపాలు ఇబ్బందులకు గురవుతాయి. పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఒకరకమైన అభద్రతా భావంతో గడుపుతున్నారు. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే.







































