పరిశ్రమలో మరో విషాదం!
Kris Jenner’s mother Mary Jo Shannon diesప్రముఖ రియాలిటీ టీవీ స్టార్ క్రిస్ జెన్నర్ తల్లి - కార్డాషియన్ కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆత్మీయురాలైన మేరీ జో షానన్ (91) అలియాస్ గ్రాండ్‌మా ఎంజె కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రిస్ జెన్నర్ సోషల్ మీడియా వేదికగా వెల్ల డించారు. ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే మేరీ జోషానన్ మరణానికి గల కారణాలను అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.
గ్రాండ్‌మా ఎంజె గా అందరికీ సుపరిచితమైన మేరీ జో షానన్ కార్డాషియన్ కుటుంబానికి గుండెకాయ వంటివారని క్రిస్ జెన్నర్ భావోద్వేగంతో పేర్కొన్నారు. తన తల్లి నుంచి కుటుంబ విలువలను, ప్రేమను, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉండటాన్ని నేర్చుకున్నానని క్రిస్ కొనియాడారు. ఆమె కుటుంబం పట్ల చూపే అంకితభావం , ఆప్యాయత అందరికీ ఆదర్శబరి గుర్తు చేసుకున్నారు.
`కీపింగ్ అప్ విత్ ది కార్డాషియన్స్` (2007-2021) రియాలిటీ షో ద్వారా ఎంజె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె కిమ్, కైలీ, కెండల్, క్లోయి, కోర్ట్నీ రాబ్ కార్డాషియన్‌లకు నాయనమ్మగా, కుటుంబంలోని ముఖ్యమైన సందర్భాల్లో ఎప్పుడూ వెన్నంటే ఉండేవారు. ఆమె లేని లోటు కుటుంబానికి తీరనిదని అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.







































