వీక్ డేస్ లో వీకైపోయిన లెనిన్

Lenin box office collectionsLenin box office collections


ఫస్ట్ వీకెండ్ వరకు అదరగొట్టిన అఖిల్ లెనిన్ వీక్ డేస్ లో వీకైపోయింది. అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ కి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ హిట్ టాక్ అయితే కనిపించింది. క్రిటిక్స్ యావరేజ్ రివ్యూస్ ఇచ్చినా.. ఆడియన్స్ ఓకే ఓకే అన్నా.. లెనిన్ టీమ్ చేసిన ప్రమోషన్స్ తో మొదటి మూడు రోజులు కలక్షన్స్ బాగా వచ్చాయి.

మూడు రోజుల్లోనే రూ.60 గ్రాస్ తీసుకొచ్చిన లెనిన్ చిత్రం తర్వాత సోమవారం నుంచి ఐదారు కోట్లకి పడిపోయింది. వర్కింగ్ డేస్ కావడంతో లెనిన్ ఆక్యుపెన్సీ కనిపించలేదు. ఈ శుక్రవారం వచ్చేసరికి లెనిన్ మరింత డల్ అయ్యింది. మరి ఈ వీకెండ్ ఏమైనా లెనిన్ కలెక్షన్స్ పుంజుకుంటాయేమో చూడాలి.

ఈ వారం చిన్న సినిమాల జాతర కనిపిస్తుంది. ఓ సుకుమారి, వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్, రాజా ది రాజా, వెంకటరామయ్యగారి మనవరాలు, MRP నీకెంత - నాకెంత లాంటి చిన్న సినిమాలు, ది ఒడిస్సీ లాంటి క్రేజ్ ఉన్న డబ్బింగ్ మూవీ విడుదలవుతున్నాయి. ఇందులో లెనిన్ ని అడ్డుకునే సినిమాలు లేకపోయినా.. లెనిన్ కి ఈ వారం ఎంత ప్లస్ అవుతుందో అనేది చూడాలి.

Lenin Movie