తమిళ ప్రేక్షకులకు తెలుగు సినిమాలు నచ్చావా?
Kiran Abbavaram reveals a shocking statement that Tamil Theatres
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం షాకింగ్ విషయాలు రివీల్ చేసారు. ఆయన చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి తమిళనాడు లో తెలుగు సినిమాల వివక్షపై, అలాగే అక్కడి థియేటర్స్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు. తెలుగు సినిమాలకు తమిళనాట థియేటర్స్ ఇవ్వరు, అదే తమిళ సినిమాలకు తెలుగులో థియేటర్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు ఆదరిస్తారు.
కానీ తమిళనాట అలా కాదు. తెలుగు సినిమాలకు థియేటర్స్ దొరకవని ఎప్పటినుంచో హీరో కిరణ్ అబ్బవరం మొత్తుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం అనడం కాదు తమిళ సినిమాలను ఆదరించబట్టే కోలీవుడ్ స్టార్ హీరోలు ఇక్కడ ప్రమోషన్స్ చేసి భారీగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆడియన్స్ కూడా తెలుగు సినిమాలతో సమానంగా తమిళ సినిమాలను ఇష్టపడుతున్నారు.
తాజాగా కిరణ్ అబ్బవరం మరోసారి చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో ఈ విషయమై మాట్లాడారు. అఖిల్ అన్న లెనిన్ చిత్రానికి తమిళనాట థియేటర్లు ఇచ్చి అది బాగా ఆడితే, ఆయనకు మార్కెట్ పెరుగుతుంది కదా అని కిరణ్ అన్నాడు. ఈ విషయమై తానొక తమిళ డిస్ట్రిబ్యూటర్ ని అడిగితే.. ఇక్కడ తమిళ ప్రేక్షకులు తెలుగులో తెరకెక్కిన చిత్రాలను తమిళ డబ్బింగ్ లో చూసేందుకు ఇష్టపడరని..
తాము కావాలంటే తెలుగు సినిమాలకు థియేటర్లు ఇస్తామని.. కానీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి తెలుగు సినిమాలు చూడరని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది అన్నారు కిరణ్. అలాంటి చోట మన తెలుగు సినిమాకి ఏం ఆదరణ ఉంటుంది. మరి నిజంగానే తమిళ ఆడియన్స్ తెలుగు సినిమాలు చూడరా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ.







































