ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sreeleela Loses One More Big Opportunity

శ్రీలీల కి దురదృష్టం ఎదురొస్తుంది

Sreeleela Loses One More Big Opportunity


క్యూట్ బ్యూటీ శ్రీలీలకు దురదృష్టం ఎదురొస్తుంది. లేకపోతె అఖిల్ కి జోడిగా లెనిన్ చిత్రాన్ని ఒప్పుకుని ఓ షెడ్యూల్ షూట్ చేసాక ఆ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకోవడమేమిటి, ఆ కేరెక్టర్ కి భాగ్యశ్రీ బోర్సే ని తీసుకోవడమేమిటి, ఆ లెనిన్ సినిమా హిట్ అవడమేమిటి. అది శ్రీలీల దురదృష్టం కాకపోతే ఇంకేమిటి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో లెనిన్ హంగామా చూసిన శ్రీలీల ఫ్యాన్స్ ఆ సినిమాని వదులుకున్నందుకు నానా తిట్లు తిడుతున్నారు. ముందు లెనిన్ నుంచి శ్రీలీల ను తప్పించారు అనుకున్నప్పుడు శ్రీలీల పై సింపతీ నే ఉంది. కానీ నాగవంశీ శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ కాక లెనిన్ నుంచి తప్పుకుంది అన్నాక ఆమెపై ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు.

ఇప్పుడు శ్రీలీల కి కోలీవుడ్ లో వచ్చిన మరో స్టార్ సినిమా చేజారిపోయింది. అజిత్ సినిమాలో శ్రీలీల అనే వార్త ఇప్పటిదికాదు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో శ్రీలీల లేదు, ఆమె ప్లేస్ లోకి కాయదు లోహర్ వచ్చి చేరింది. కారణం ఏదైనా ఇదంతా చూస్తే శ్రీలీలకు దురదృష్టం ఎదురొచ్చినట్టేగా.

Sreeleela reportedly replaced by Kayadu Lohar in Ajith next