స్పిరిట్ కు బ్రేకులు - ఫౌజీ సౌండ్ స్టార్ట్

Prabhas Fauzi update


 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఫిబ్రవరి నుంచి రెండు సినిమాల షూటింగ్స్ లో తలమునకలై ఉన్నారు. రాజసాబ్ డిస్టబెన్స్ తర్వాత ప్రభాస్ తన నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ విషయంలో చాలా కష్టపడుతున్నారు. సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ కి బ్రేకులు లేకుండా షూటింగ్ చేస్తూ వస్తున్నారు సమ్మర్ కూడా వదలకుండా స్పిరిట్ షూటింగ్ చేశారు.

ఇపుడు స్పిరిట్ షూటింగ్ కి బ్రేకులు వేసి ప్రభాస్ ఇకమీదట మీద ఫౌజీ షూటింగ్ లోకి వెళ్లబోతున్నారు. దసరా టార్గెట్ అన్నప్పటికీ .. ఇప్పుడు ఫౌజీ ని డిసెంబర్ కు మళ్లించారని వార్తల మద్యన ప్రభాస్ ఫౌజీ షూటింగ్ ఫినిష్ చెయ్యాలని చూస్తున్నారట. ఆ మేరకు ప్రభాస్ ఇకపై ఫౌజీ సెట్స్ లోకి వెళ్ళబోతున్నారట.

ఫౌజీ సినిమాలో ప్రభాస్ ఒక సోల్జర్ గా కనిపించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో రెండు యూనిట్లు డే అండ్ నైట్ పని చేస్తున్నాయట. కోకాపేట్, తాహెర్ సౌండ్ యూనిట్ వద్ద వేర్వేరు భాగాల చిత్రీకరణ జరుగుతోంది.

ఫౌజీ చిత్రం కోసం ప్రభాస్ డేట్లు 30 రోజులు పెండింగ్ ఉన్నాయని, వాటిని పూర్తిగా ఇచ్చేలా ప్రభాస్ సిద్ధమయ్యారని, స్పిరిట్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి ఫౌజీ ని ఫినిష్ చేసి ఆడియన్స్ ముందుకు తెచ్చేలా ప్లానింగ్ చేసారట.  

 

Spirit Update