ఆసుపత్రి నుంచి పవన్ డిస్ఛార్జ్

Pawan discharged from hospital


నాలుగు రోజుల క్రితం ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి అక్కడి వైద్యులు సర్జరీ చేసారు. ఆతర్వాత రోజు పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు తో పాటుగా పలువురు మంత్రులు ముంబై వెళ్లి పవన్ ని పరామర్శించి వచ్చారు.

అంతేకాకుండా మహారాష్ట్ర సీఎం కూడా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్ చేసిన వైద్యులు రోజు ఆ చేతికి ఫిజియో థెరపీ చేస్తున్నారు. నేడు ముంబై ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. అయితే పవన్ ఎడమ భుజానికి కూడా సర్జరీ అవసరమని సూచించారు వైద్యులు.

ఎడమ భుజానికి వైద్యులు మరో రెండు నెలల్లో సర్జరీ నిర్వహిస్తారని, ఈ రెండు నెలలు పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు పవన్ కి సూచించారు. ప్రస్తుతం ముంబై ఆసుపత్రి నుంచి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని పవన్ ఆయన భార్య అన్నా లు హైదరాబాద్ చేరుకోబోతున్నారు.

Pawan Kalyan