బంగారంలా మెరిసిపోతున్న జాన్వీ
Janhvi Kapoor's 24K Gold Look Viral
ఈమధ్యన భీమా జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన జాన్వీ కపూర్ ఇప్పుడు ఏ లుక్ లో కనిపించినా బంగారంలానే మెరిసిపోతుంది. రీసెంట్ గా తన కజిన్ అన్షులా కపూర్ పెళ్లిలో తెగ సందడి చేసిన జాన్వీ కపూర్.. ఆ పెళ్ళిలో ఏ కాస్ట్యూమ్ లో కనిపించినా వావ్ బ్యూటిఫుల్ ఆనేలానే కనిపించింది.
చెల్లెలు ఖుషి కపూర్ తో కలిసి జాన్వీ కపూర్ అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ తో ఆకట్టుకుంది. తాజాగా గోల్డ్ కలర్ కాస్ట్యూమ్, గోల్డ్ జ్యువలరీతో బంగారంలా మెరిసిపోయింది. మెడలో హెవీ ప్యూర్ గోల్డ్ నెక్ లెస్, చెవులకు పెద్ద పెద్ద బట్టలతో, గోల్డ్ కలర్ డ్రెస్ లో నిజంగా గోల్డ్ లా మెరిసి మురిపించింది.
సాంప్రదాయంగా కనిపించినా ఆమె అందాలు యూత్ ని బాగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Janhvi Kapoor







































