ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Goa has truly grown on me over the years: Amruta Khanvilkar

హాట్ బ్యూటీ మనసు గెలుచుకున్న గోవా!

Goa has truly grown on me over the years: Amruta Khanvilkar

బాలీవుడ్ హాట్ బ్యూటీ అమృతా ఖన్విల్కర్ కెరీర్ ప్రయాణంలో గోవా ప్రాంతంతో ఏర్పరచుకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో గోవా కేవలం పర్యాటక ప్రాంతంగా మాత్రమే క‌నిపించినా? కాలక్రమేణా ఆ ప్రదేశం తన వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారిపోయిందన్నారు. గోవాలోని ప్రశాంతమైన వాతావరణం, అక్కడి సంస్కృతి , జీవనశైలి  ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. అందుకే ప్రతిసారీ గోవా కొత్తదనాన్ని అనుభ విస్తున్నానని  తెలిపారు.

`సినిమా షూటింగ్‌లు.. పని ఒత్తిడి నుంచి బయటపడటానికి గోవా సురక్షితమైన ప్రదేశంలా మారింది. నగర జీవనానికి భిన్నంగా ప్రకృతికి దగ్గరగా ఉండే గోవాలోని లోకల్ వైబ్,  మరింత సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా గోవాలోని సముద్ర తీరాల్లో గడపడం, అక్కడి స్థానిక వంటకాలను ఆస్వాదించడం వంటివి ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయ‌ని.. తనలోని ఒత్తిడిని దూరం చేసి మళ్ళీ పనిలో చురుగ్గా పాల్గొనేలా చేస్తాయని ఆమె పేర్కొన్నారు.

అమృతా అనుభవం చూస్తుంటే? ఒక ప్రాంతంతో  సందర్శించడం ద్వారానే  అక్కడి అనుభూతులతో మమేకం అవ్వడం ద్వారా బలమైన బంధం ఏర్పడుతుందని అర్థమవుతుంది. బిజీ షెడ్యూల్స్ మధ్యలో కూడా  నచ్చిన ప్రదేశం ఎంతటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందో?  ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. పర్యాటకంగా మాత్రమే కాకుండా,  వ్యక్తి ఎదుగుదలలో లేదా మానసిక స్థిరత్వంలో ఒక ప్రదేశం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో? ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Amruta Khanvilkar says Goa has truly grown on her over the years