ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Emotional Akhil falls at Nagarjuna feet

కన్నీళ్లతో తండ్రి నాగ్ ని హగ్ చేసుకున్న అఖిల్

Emotional Akhil falls at Nagarjuna feet

 

అఖిల్ చాలా రోజుల తర్వాత లెనిన్ తో సక్సెస్ సాధించడంతో కింగ్ నాగార్జున పుత్రోత్సాహంతో ఎంతో పొంగిపోతున్నారు. అఖిల్ నటించిన రూరల్ డ్రామా లెనిన్ ఈరోజు జులై 10 న విడుదలైంది. రెండుమూడుసార్లు లెనిన్ పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్ గా ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన లెనిన్ చిత్రానికి అన్నివైపుల నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

లెనిన్ కి వస్తున్న ఫీడ్ బ్యాక్ తో అన్నపూర్ణ స్టూడియోస్ లో కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసారు. ఏజెంట్ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తో అభిమానుల ముందుకు వచ్చిన అఖిల్ లెనిన్ తో వారిని ఇంప్రెస్స్ చేసాడు. లెనిన్ కి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో అఖిల్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో తండ్రి నాగార్జున ను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఎన్నో ఏళ్లుగా సక్సెస్ కోసం తపించిన అఖిల్ కి లెనిన్ రిజల్ట్ ఇచ్చిన సంతోషం అంతా ఇంతా కాదు. అందుకే తండ్రి కాళ్ళకు నమస్కారం చేసి ఆయన్ని పట్టుకుని గట్టిగా హగ్ చేసుకుని అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ దృశ్యం చూసిన ఓ ప్రేక్షకుడు..

నాగార్జున గారు ఏడవటం మొదటి సారి చూస్తున్నా.. 🙏 విజయం ఇచ్చే ఆనందం, కొడుకు ప్రయోజకుడు అయితే ఒక తండ్రి కి ఇంత కంటే ఆనందం ఏముంటుంది. 
కేవలం అక్కినేని అభిమానులకి మాత్రమే కాదు, ప్రతీ ఒక్కరికి ఈ క్షణాలు ప్రత్యేకంగా గుర్తుకు వస్తాయి అంటూ ట్వీట్ చేసారు.

Emotional Akhil falls at Nagarjuna feet during Lenin success