ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The star singer's weight loss journey is interesting!

స్టార్ సింగ‌ర్ వెయిట్ లాస్ జ‌ర్నీ ఇంట్రెస్టింగ్!

The star singer's weight loss journey is interesting!

కంట్రీ మ్యూజిక్ సింగర్ నేట్ స్మిత్ వెయిట్ లాస్ జ‌ర్నీ తో  అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు. 280 పౌండ్ల నుండి 225 పౌండ్లకు తగ్గే క్రమంలో ఆయన అనుసరించిన పద్ధతులు సరళంగా ఉన్నప్పటికీ వాటి వెనుక ఉన్న క్రమశిక్షణ చాలా కీల‌క‌మైంది. ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌ను ఓ దైనందిన కార్యక్రమంగా మార్చుకోవడం ద్వారా నేట్ స్మిత్ అద్భుతమైన మార్పును సాధించగలిగారు.

ఈ మార్పు కోసం నేట్ స్మిత్ ప్రధానంగా కేలరీల నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చారు. అతిగా తినే అలవాటును మానుకున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలను మాత్రమే అందించడం ద్వారా  బరువును క్రమబద్ధీ కరించుకున్నారు. కేవలం ఆహారం మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామంవ‌ల్ల  శరీరంలో శక్తి స్థాయిలు మెరుగుపడటమే కాకుండా స్టేజ్ మీద గంటల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చే సామర్థ్యం కూడా పెరిగింది. దీనివల్ల ఆయన వృత్తిపరమైన జీవితంపై కూడా సానుకూల ప్రభావం పడింది.

నేట్ స్మిత్  ఈ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని అందం కోసం కాకుండా, ఆరోగ్యం , దీర్ఘకాలిక శక్తి కోసం తీసుకున్న నిర్ణయంగా చెప్పుకొచ్చారు. తక్షణ ఫలితాల కోసం కాకుండా జీవితకాల మార్పు కోసం నిరంతరం ప్రయత్నించడమే బరువు తగ్గడంలో నిజమైన రహస్యమని  నిరూపించారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ఎంచుకుంటే ఎవరైనా  ఆరోగ్య లక్ష్యాలను చేరుకోగలరనే నమ్మకాన్ని నేట్ స్మిత్ కలిగించారు. మ‌రో మూడు నెల‌ల పాటు ఇదే ర‌క‌మైన జీవ‌న విధాన్ని కొన‌సాగిస్తే?  సాధార‌ణ ఎత్తుకు త‌గ్గ బ‌రువుకు చేరుకుంటారు.
 

Nate Smith shares weight loss milestone after binge-eating battle