ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prashanth Neel Is Planning A Mind-Blowing Interval Episode in Dragon

డ్రాగన్ - ఊహకందని ఇంటర్వెల్ ఎపిసోడ్

Prashanth Neel Is Planning A Mind-Blowing Interval Episode in Dragon

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో భారీ యాక్షన్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్ర షూటింగ్ ఫుల్ స్పీడులో జరుగుతుంది. ఎన్టీఆర్ లుక్ కోసం నాలుగు నెలలు డ్రాగన్ షూటింగ్ చెయ్యకుండా వెయిట్ చేసిన నీల్ ఈసారి గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ లో విడుదలకు డేట్ లాక్ చేసారు.

తాజాగా ఈ భారీ యాక్షన్ చిత్రం లో ఇంటర్వెల్ బ్లాక్ పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ని తలదన్నే రీతిలో డ్రాగన్ ఇంటర్వెల్ బ్లాక్ ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారట. అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక ఊహించని విజువల్ ఫీస్ట్ గా మారబోతుందని సమాచారం.

ఇక దర్శకుడు నీల్ ఈసారి తన డార్క్ షేడ్స్ ని పక్కనపెట్టి.. డ్రాగన్ కోసం సరికొత్తగా మారిపోయారా. డ్రాగన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం చాలా కలర్ఫుల్ గా, వైబ్రెంట్ విజువల్ ప్యాలెట్ తో రిచ్ గా తెరకెక్కిస్తున్నారట. కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ భామను నీల్ ఎంపిక చేసారనే వార్త వినిపిస్తుంది.

ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపిస్తుండగా.. పలువురు క్రేజీ విలన్స్ ఈ చిత్రంలో భాగమయ్యారు.

Jr NTR's Dragon hints at a huge interval block