వెండి తెర దాదా ఐకానిక్ లార్డ్స్ మూమెంట్ రీక్రియేషన్!

First Look Of Rajkumar Rao As DadaFirst Look Of Rajkumar Rao As Dada

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా  `దాదా - ది సౌరవ్ గంగూలీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్  విడుదలైంది. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా  పోస్టర్‌ను చిత్రబృందం ఆవిష్కరించింది. ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో నటిస్తున్న రాజ్ కుమార్ రావు, లార్డ్స్ స్టేడియం బాల్కనీలో గంగూలీ తన చొక్కాను గాలిలో ఊపుతూ జరిపిన  సంబరాన్ని అద్భుతంగా అనుకరించారు. ఈ పోస్టర్ అభిమానులలో సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

రాజ్ కుమార్ రావు  నటనతో గంగూలీ హావభావాలను ఒడిసిపట్టడంలో చూపిస్తున్న ప్రతిభ ఫస్ట్ లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన సాధారణ యువకుడు భారత క్రికెట్ జట్టుకు అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్‌గా ఎలా?  ఎదిగాడనే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ చిత్రం వెండితెరపై ఆవిష్క‌రిస్తుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కుమార్ రావు  గంగూలీ  పాత్ర కోసం ఎంతో కసరత్తు చేసినట్లు అర్థమవుతోంది.

చిత్రబృందం సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. 2027 మే 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సెలవు దినాలను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ తేదీని నిర్ణయించారు. క్రికెట్ చరిత్రలో  కొత్త అధ్యాయానికి నాంది పలికిన నాయకుడి జీవితగాథను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క‌పిల్ దేవ్ త‌ర్వాత ఇండియా టీమ్ ను స‌మ‌ర్ద‌వంతంగా న‌డిపిన కెప్టెన్ల‌ల‌లో గంగూలీ ఒక‌రు అన్న సంగ‌తి తెలిసిందే.

Dada The Sourav Ganguly Story First Look Revealed On His Birthda