Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> All eyes are on the VFX of Nagabandham

నాగబంధం VFX పైనే అందరి చూపు

All eyes are on the VFX of Nagabandham

 

అభిషేక్ నామ తెరకెక్కించిన నాగబంధం మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ రూపంలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దాదాపుగా రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం లో చెప్పుకోదగిన స్టార్ క్యాస్ట్ లేదు. అయినా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి. కారణం ఈ చిత్రానికి అభిషేక్ నామ చేసిన ప్రమోషన్స్.

సినిమా కోసం ఎంత భారీ టెంపుల్ సెట్స్ వేసారో అంతకు మించి ప్రమోషన్స్ కోసం టెంపుల్ సెట్ వేసి ఆడియన్స్ ను ఆకర్షించారు. ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అలాగే ఆడియన్స్ కళ్లన్నీ నాగబంధం VFX వర్క్ పైనే ఉన్నాయి. ఎన్నో అంచనాలు, భారీ బడ్జెట్ తో రీసెంట్ టైమ్ లో వచ్చిన చాలా సినిమాలు ఈ VFX విషయంలో ఫెయిల్ అయ్యి విమర్శల పాలయ్యాయి.

ఇప్పుడు అభిషేక్ నామ విదేశీ కంపెనీస్ ని నమ్ముకోకుండా హైదరాబాద్ లో గ్రాఫిక్స్ చేయించారు. అంతే కాదు నాగబంధం టీజర్, ట్రైలర్ అన్ని విజువల్ గ్రాండ్ గా కనిపించడంతో ఇపుడు నాగబంధం VFX వర్క్ తెరపైకి ఎలా కనిపించబోతుంది అనే ఆసక్తితో అందరూ ఉన్నారు.

మరి నాగబంధం VFX వర్క్ క్వాలిటీ ఆడియన్స్ కి గనక డివోషనల్ గా సినిమా పాస్ అయినట్లే. చూద్దాం నాగబంధం రిజల్ట్ ఏమిటి అనేది మరికొద్దిగంటల్లో తేలిపోతుంది.

Abhishek Nama brings in huge VFX studios for Nagabandham