ట్రెడిషనల్ లుక్ లో మతిపోగొడుతున్న జాన్వీ
Janhvi Kapoor looks stunning in a traditional look
ఎప్పుడు గ్లామర్ లుక్స్ కి ప్రాధాన్యత ఇచ్చే హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ట్రెడిషనల్ గా కనిపిస్తే అది చాలా స్పెషల్ అనే చెప్పాలి. సినిమాల్లో కూడా గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే జాన్వీ కపూర్ అమావాస్యకో, పున్నానికో సాంప్రదాయంగా దర్శనమిస్తుంది. ఆమె సోషల్ మీడియా లుక్స్ ఎలా ఉన్నా గుడులకు, గోపురాలకు వెళ్ళేటప్పుడు అందంగా ముద్దుగా లంగావోణీ, లేదంటే చీర కట్టులో రెడీ అవుతుంది.
తాజాగా మెరూన్ కలర్ అంచు ఉన్న ట్రాన్స్పరెంట్ శారీ లో మెడలో డిజైనర్ నెక్ లెస్ తో చెవులకు పెద్ద పెద్ద జుంకీలతో జాన్వీ కపూర్ హెవీ ట్రెడిషనల్ లుక్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. లూజ్ హెయిర్ లో కనిపించినా జాన్వీ కపూర్ తాజా లుక్ ఏంజిల్ లా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
జాన్వీ కపూర్ తన సిస్టర్ అన్షులా కపూర్ వెడ్డింగ్ వేడుకల్లో ఇలా చీర కట్టులో అందంగా ముస్తాబయ్యింది.
ఈమధ్యనే జాన్వీ కపూర్ పెద్ది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి పలు విమర్శలు పాలైంది. ఇకపై జాన్వీ కపూర్ ఏమైనా నటనకు ప్రధాన్యత ఉన్న పాత్రలపై ఫోకస్ పెడుతుందేమో చూడాలి.







































