మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కలయికలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం విడుదల వాయిదాల పర్వంలో మెగా ఫ్యాన్స్ డిస్టర్బ్ అయ్యారు. మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 30, ఇప్పుడు అక్కడ నుంచి జూన్ 25 కి షిఫ్ట్ అయ్యింది. పెద్ది షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో పెద్ది విడుదల వాయిదా పడింది.
అయితే పెద్ది చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ చేసాక మేకర్స్ జూన్ 4 కి విడుదల చేయాలనుకున్నారు. కానీ యశ్ టాక్సిక్ అదే రోజు విడుదల కావడంతో ఎందుకులే, హరీబరిగా సినిమాను విడుదల చెయ్యడమని ఆపేసారు. అందుకే ఆచి తూచి లెనిన్ ని ఇరకాటంలో పెట్టి పెద్ది ని జూన్ 25 కి ఫిక్స్ చేసారు.
కానీ ఇప్పుడు టాక్సిక్ పోస్ట్ పోన్ అవడంతో పెద్ది చిత్రాన్ని జూన్ 4 కి విడుదల చేస్తే ఎలా ఉంటుంది, జూన్ 25 నుంచి ప్రీ ఫోన్ చేస్తే బావుంటుంది అనే ఆలోచనలో పెద్ది మేకర్స్ కనిపించడంతో.. పెద్ది మళ్లీ ఏంటి కన్ఫ్యూజన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్స్. మరి ఈరోజే ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.
పెద్ది చిత్రం నుంచి రాబోతున్న మూడో లుక్ మరింత సర్ ప్రైజ్ చేస్తుంది అని..క్రికెటర్ గా, పహిల్వాన్ గా కనిపించిన రామ్ చరణ్ పెద్ది మూడో లుక్ మరింత సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం ఖాయమంటున్నారు.




టార్గెట్ రీచ్ అవుతున్న ప్రభాస్ ఫౌజీ
Loading..