పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రం షూటింగ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. రాజా సాబ్ రిజల్ట్ తర్వాత ప్రభాస్ ఎక్కువగా ఫౌజీ పైనే ఫోకస్ పెట్టారు. కొద్దిరోజుల క్రితమే ఫౌజీ షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ రావడంతో ప్రభాస్ ఇటలీ కి సమ్మెర్ వెకేషన్ కి వెళ్లిపోయారు.
తాజాగా ఫౌజీ టార్గెట్ రీచ్ అవుతుందట. అంటే దసరా టార్గెట్ గా పెట్టుకున్న ఫౌజీ అందుకు అనుగుణంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందట. ఇంకా ఫౌజీ మూడు యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప మిగిలిన షూటింగ్ అంతా ఆల్మోస్ట్ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని దసరా కు తీసుకొచ్చేలా దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో వార్ డ్రామాతో పాటు హను మార్క్ లవ్ స్టోరీ తో క్యూట్ టచ్ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వి ప్రభాస్ కి జోడిగా కనిపించనుంది.




అప్పుడు సమంత ఇప్పుడు అనుపమ
Loading..