Advertisementt

రామ్ చరణ్ తో బుచ్చి - హ్యాపీ మూమెంట్స్

Sun 26th Apr 2026 06:31 PM
peddi  రామ్ చరణ్ తో బుచ్చి - హ్యాపీ మూమెంట్స్
Peddi Special Song Shoot Bigins రామ్ చరణ్ తో బుచ్చి - హ్యాపీ మూమెంట్స్
Advertisement
Ads by CJ

పెద్ది చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు ఆదివారం పెద్ది స్పెషల్ సాంగ్ చిత్రీకరణ మొదలైంది. శృతి హాసన్ ఈ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుంది. రామ్ చరణ్ తో కలిసి స్టెప్స్ వేయనుంది. పెద్ది చిత్రాన్ని జూన్ 25 న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. పెద్ది రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఈలోపే దర్శకుడు బుచ్చి బాబు రామ్ చరణ్ తో కలిసి పెద్ది సెట్ లో దిగిన ఫొటోస్ షేర్ చేసారు. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా ఇద్దరు ఎంతో క్లోజ్ గా హ్యాపీ మూడ్ లో కనిపిస్తున్నారు. సో పెద్ది షూటింగ్ ఫినిష్ అవుతుంది, ఇకపై ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి అంటూ హింట్ ఇచ్చేసారు.

షూటింగ్ ఫినిష్ అవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా పెద్ది ప్రమోషన్స్ ను పాన్ ఇండియా వేదికగా బుచ్చి బాబు ప్లాన్ చేస్తున్నారు. పెద్ది జూన్ 25 న వచ్చి రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం. అదే ఫీలింగ్ రామ్ చరణ్ ఇంకా బుచ్చి బాబు మొహాల్లో కనిపించిన స్మైల్ చూస్తేనే తెలిసిపోతుంది. 

Peddi Special Song Shoot Bigins:

Ram Charan and Buchi Babu

Tags:   PEDDI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ