Advertisementt

సాయి పల్లవి ప్లేస్ లో రుక్మిణి వసంత్

Sun 26th Apr 2026 03:57 PM
rukmini vasanth  సాయి పల్లవి ప్లేస్ లో రుక్మిణి వసంత్
Rukmini Vasanth replaces Sai Pallavi సాయి పల్లవి ప్లేస్ లో రుక్మిణి వసంత్
Advertisement
Ads by CJ

సాయి పల్లవి హిందీ రామాయణ తో బాలీవుడ్ లో అడుగుపెడుతుంది. రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మరోపక్క తమిళ సినిమాల్తో బిజీగా వుంది. సాయి పల్లవి ఈమధ్యన గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనున్న ప్రముఖ సింగర్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించనుంది అనే ప్రచారం జరిగింది. సాయి పల్లవి అయితే ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనుకున్నారు.

నటనలో సహజత్వం, హుందాతనం వంటి లక్షణాలు సాయి పల్లవిని ఈ పాత్రకు సాయి పల్లవి నే సరైన ఎంపికగా నిలబెట్టాయి. కానీ ఇప్పుడు ఈ చిత్రం నుంచి సాయి పల్లవి తప్పుకుంది అని తెలుస్తుంది. సాయి పల్లవి ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామాయణం పాన్ ఇండియా మూవీ, ఇతర కమిట్‌మెంట్లు, కాల్‌షీట్ సమస్యలు కారణంగా ఈ బయోపిక్‌కు సమయం కేటాయించడం కష్టమైందనే టాక్ వినబడుతుంది.

అయితే ఇప్పుడు సాయి పల్లవి వదులుకున్న సుబ్బలక్ష్మి పాత్రకు కన్నడ కాంతార 2 భామ రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. సప్త సాగరదాచే ఎల్లో, కాంతార 2 సినిమాల తో సౌత్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రుక్మిణి అయితే ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ కి న్యాయం చేస్తుంది అంటున్నారు.

క్లాసికల్ లుక్, సంప్రదాయ శైలి, తెరపై హుందాతనం ఆమె ఈ పాత్రకు సూట్ అయ్యేలా చేస్తాయని అంటున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Rukmini Vasanth replaces Sai Pallavi :

Rukmini Vasanth replaces Sai Pallavi in the M. S. Subbulakshmi biopic

Tags:   RUKMINI VASANTH
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ