Advertisementt

కౌంటర్ ఎటాక్ కోసం వెయిటింగ్

Sun 26th Apr 2026 09:45 AM
kavitha  కౌంటర్ ఎటాక్ కోసం వెయిటింగ్
BRS Silent After Kavitha Targets KCR కౌంటర్ ఎటాక్ కోసం వెయిటింగ్
Advertisement
Ads by CJ

కల్వకుంట్ల కవిత పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించడమే కాదు.. తండ్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎడా పెడా కడిగిపారేసింది. కేసీఆర్ బండరాయి, ఈనాటి కేసీఆర్‌ వేరు-ఆనాటి కేసీఆర్ వేరు, ఆనాటి కేసీఆర్‌ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్‌ మన మనిషి కాదు, మర మనిషి. ఆ సార్‌ ఇప్పుడు రారు, ఎందుకంటే ఆయన మరమనిషి.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగా పాలించలేదు. అందుకే సరైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన కేసీఆర్‌ ఏం చేస్తున్నారు, ఆయన మన కేసీఆర్‌ కాదు.. మారిన కేసీఆర్‌ అంటూ ఎడా పెడా కేసీఆర్ ని కవిత విమర్శించింది. మొదటిసారి కవిత కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది.

మరి కేసీఆర్ ని కవిత అన్నన్ని మాటలంటున్నా బీఆర్ఎస్ నేతలు కానీ, కేటీఆర్, హరీష్ రావు లు ఇంకా ఎలాంటి కౌంటర్ ఎటాక్ ఇవ్వకపోవడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ తన బిడ్డ కవిత కు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారా అనే క్యూరియాసిటీ తెలంగాణ వ్యాప్తంగా అందరిలో మొదలయ్యింది.

ఇప్పటివరకు కేసీఆర్ బిడ్డ కాబట్టి విమర్శిస్తే బాగోదని బీఆర్ఎస్ నేతలు, ఎంతవరకు మాట్లాడుతుందో చూద్దామని కేసీఆర్ వేచి చూసారు. కవిత ఇప్పుడు కేసీఆర్ విషయంలో హద్దులు దాటేసి మాట్లాడింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ నుంచి కవితకు వచ్చే కౌంటర్ ఎటాక్ కోసం వెయిటింగ్ ఇక్కడ.  

BRS Silent After Kavitha Targets KCR:

Kavitha vs KCR

Tags:   KAVITHA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ