Advertisementt

ఫ్రాడ్ కేసులో బిగ్ బాస్ అషు రెడ్డి

Sun 26th Apr 2026 09:13 AM
ashu reddy  ఫ్రాడ్ కేసులో బిగ్ బాస్ అషు రెడ్డి
Fraud Case Files Against Ashu Reddy ఫ్రాడ్ కేసులో బిగ్ బాస్ అషు రెడ్డి
Advertisement
Ads by CJ

నటిగా కెరీర్ స్టార్ట్ చేసి క్రేజ్ కోసం బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన అషు రెడ్డి ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. స్పెషల్ ఫోటోషూట్స్, గ్లామర్ షూట్స్ అంటూ  సోషల్ మీడియాలో హడావిడి చేసే అషు రెడ్డి పై తాజాగా ఫ్రాడ్ కేసు బుక్ అవడం హాట్ టాపిక్ అయ్యింది. ఒక NRI యువకుడిని ప్రేమ పేరుతొ మోసం చేసి డబ్బులు కాజేసింది అంటూ అషు రెడ్డి పై కేసు పెట్టాడు సదరు యువకుడి తండ్రి.

అసలు కథ ఏమిటి అంటే.. లండన్‌లో జాబ్ చేస్తున్న ధర్మేంద్ర కు 2018లో అషు రెడ్డి తో పరిచయం ఏర్పడగా.. తాను యుఎస్ లో చదువు పూర్తి చేసుకుని, సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చానని చెప్పి అషు రెడ్డి అతనితో సన్నిహితంగా ప్రవర్తించడమే కాకుండా కొద్దిరోజుల్లోనే ఆ పరిచయం ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ధర్మేంద్రను మోసం చేసింది అంటూ ఫిర్యాదు అందడంతో ఆమెపై CCS పోలీసులు కేసు నమోదు చేసారు.

ప్రేమ పేరుతొ ధర్మేంద్ర కు దగ్గరైన అషు రెడ్డి పలుమార్లు తనకు అవసరాలు ఉన్నాయంటూ కోట్ల రూపాయలు తీసుకుని, పెళ్లి చేసుకుందామని అడిగిన ధర్మేంద్ర కు మాయ మాటలు చెబుతూ వచ్చింది అని, ధర్మేంద్ర ఫ్యామిలీ మెంబెర్స్ పెళ్లి కోసం ఏర్పాట్లు చెయ్యగా అషు రెడ్డి పెళ్లిని వాయిదా వేస్తూ.. చివరికి మాట తప్పి మోసం చేసింది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు దర్మేంద్ర కుటుంబ సభ్యులు.

ధర్మేంద్ర తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. 2018 నుంచి 2025 వరకు అషురెడ్డి తమ నుంచి నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాల రూపంలో మొత్తం రూ.9.35 కోట్ల మేర ఆస్తులు, డబ్బులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అవన్నీ అషు రెడ్డి పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసింది అంటూ ఆయన ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది.

Fraud Case Files Against Ashu Reddy:

NRI Files Case Against Ashu Reddy

Tags:   ASHU REDDY
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ