Advertisementt

మే డే - కామెడీ vs కామెడీ

Sat 25th Apr 2026 07:07 PM
jet lee  మే డే - కామెడీ vs కామెడీ
May Day: Comedy vs Comedy మే డే - కామెడీ vs కామెడీ
Advertisement
Ads by CJ

ఉక్కపోతకన్నా ఎక్కువగా సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక ఆడియన్స్ ఎంతగా అల్లాడిపోతున్నారో చెప్పనలవి కాదు. పెద్ద సినిమాలు లేవు, అలాగే ఇంట్రెస్టింగ్ గా చూద్దామనుకునే కంటెంట్ ఉన్న సినిమాలు రావడం లేదు. మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ సమ్మర్ కి మొహం చాటెయ్యడంతో ఆయమన్న సినిమాలేవీ బాక్సాఫీసు దగ్గర సందడి చెయ్యట్లేదు.

ఈ వారం విడుదలైన గేదెలరాజు వార్తల్లో లేకుండా పోయింది. ఇక మలయాళ డబ్బింగ్ చిత్రం వాలా 2 బావుంది, కానీ థియేటర్స్ కి వెళ్లి ఆ డబ్బింగ్ సినిమా చూసే ఊపు ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. ఇక రాబోయే మే డే లాంగ్ వీకెండ్ లో క్రేజీ సినిమా లు ఏమైనా వస్తున్నాయా అంటే అవి కూడా చిన్న సినిమాలే.

మే డే కి కామెడీ vs కామెడీ అన్న రేంజ్ రెండు సినిమాలు పోటీకి రాబోతున్నాయి. అందులో తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం. సత్య జెట్ లీ. ఈ రెండు చిత్రాలు కామెడీ కంటెంట్ తో తెరకెక్కినవే. గాయపడ్డ సింహం ట్రంప్ కార్డు తో ప్రమోషన్స్ లో తరుణ్ భాస్కర్, జెడి లు హడావిడి చేస్తుంటే.. జెట్ లీ అంటూ సత్య కామెడీగా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.

మే డే లాంగ్ వీకెండ్ లో ఈ రెండు చిత్రాల్లో ఏది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ సి. 

May Day: Comedy vs Comedy:

Gayapadda SImham vs Jet Lee

Tags:   JET LEE
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ