Advertisementt

లెనిన్ ఇంత సైలెంట్ ఎందుకు

Sat 25th Apr 2026 05:18 PM
lenin  లెనిన్ ఇంత సైలెంట్ ఎందుకు
Lenin Movie release confusion లెనిన్ ఇంత సైలెంట్ ఎందుకు
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేనిని కష్టాలు కాదు పెద్ది రామ్ చరణ్ వెంటాడుతున్నారు. మూడేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటాలని చూస్తున్న అఖిల్ ని రామ్ చరణ్ నిద్రపోకుండా చేస్తున్నాడు. ఏజెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం లెనిన్. ఈ చిత్రాన్ని మే 1 రిలీజ్ అంటే పెద్ది అడ్డం పడింది. సరే జూన్ 26 అంటే మళ్ళీ పెద్ద గండం తగులుకుంది.

లెనిన్ అప్ డేట్స్ కానీ లీకులు కానీ లేకుండా దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి తాపత్రయపడుతూ గుట్టుచప్పుడు కాకుండా సినిమా పూర్తి చేస్తున్నా లెనిన్ పై నీడలా పెద్ది వెంటాడుతుంది. అయితే జూన్ 25 న పెద్ది రాక తో లెనిన్ రిలీజ్ డేట్ డిస్ట్రబ్ అవుతుంది. దానితో లెనిన్ ని మళ్లీ ఎప్పటికి పోస్ట్ పోన్ చేస్తారో అని అక్కినేని అభిమానులు భయపడుతున్నారు.

లెనిన్ మేకర్స్ కూడా సైలెంట్ గా ఉండడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. మరోపక్క నిర్మాత నాగవంశీ మాత్రం లెనిన్ ని పోస్ట్ పోన్ చేసేది లేదు.. కావాలంటే ప్రీ పోన్ చేద్దామని చూస్తున్నారట. అందుకు సంబందించిన లెనిన్ పనులు ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారట. కాకపోతే లెనిన్ షూటింగ్ పూర్తయ్యిందా, పోస్ట్ ప్రొడక్షన్ మొదలైందా, అసలు లెనిన్ ప్రోగ్రెస్ ఏమిటి అనేది మాత్రం అస్సలు క్లారిటి లేదు.

మరి లెనిన్ విషయంలో హడావిడి వద్దు. కంటెంట్ మాట్లాడాలని అఖిల్ ఆపినా.. అదిరిపోయే కంటెంట్ తో సినిమాపై అంచనాలు పెంచాల్సిన మేకర్స్ ఇంత చప్పుడు చేయకుండా ఉంటె ఎలా అనేది అక్కినేని అభిమానుల బాధ. 

Lenin Movie release confusion :

Lenin Movie update

Tags:   LENIN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ