మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది పాన్ ఇండియా మూవీ తో జూన్ లో ఆడియన్స్ ముందు రాబోతున్నారు. పెద్ది చిత్రం పై పాన్ ఇండియా మార్కెట్ లో బీభత్సమైన అంచనాలున్నాయి. పెద్ది కన్నా ముందే రామ్ చరణ్ రేంజ్ ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ లో పెరిగిపోయింది.
గేమ్ చేంజర్ డిజాస్టర్ ఏ విధముగాను రామ్ చరణ్ కెరీర్ ని ఎఫెక్ట్ చెయ్యలేదు. ఆ డిజాస్టర్ మొత్తం దర్శకుడు శంకర్ ఖాతాలోకే వెళ్ళిపోయింది. అందుకే రామ్ చరణ్ క్రేజ్ కి ఎలాంటి ఢోకా లేదు. కాబట్టే చరణ్ కి పారితోషికం కూడా ఆ రేంజ్ లో మేకర్స్ ఇస్తున్నారని తెలుస్తుంది. పెద్ది చిత్రం కోసం రామ్ చరణ్ రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్ అందుకున్నారనే టాక్ మెగా ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
పెద్ది చిత్రం కోసం రామ్ చరణ్ అక్షరాలా రూ.120 కోట్ల పారితోషికం అందుకున్నారనే వార్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్. ఇక రామ్ చరణ్ తదుపరి చిత్రం సుకుమార్ తో చేస్తున్నారు. రామ్ చరణ్-సుకుమార్ కలయికలో తెరకెక్కబోయే RC17 చిత్రం కోసం చరణ్ రూ.140 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నారని సమాచారం.




ఐస్ క్రీమ్ లా కరిగిపోతున్న సమ్మర్
Loading..