అఖిల్ ని చరణ్ వదిలిపెట్టడం లేదు. లెనిన్ కి పెద్ది తలనొప్పిలా తయారైంది. మే 1 న లెనిన్ రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్ కి పెద్ది మేకర్స్ ఏప్రిల్ 30 విడుదల అంటూ డేట్ ఇవ్వడంతో లెనిన్ ని తీసుకెళ్లి జూన్ 26 కి పెట్టారు. జూన్ 26 అఖిల్ లెనిన్ రిలీజ్ అని కూల్ గా పని చేసుకుంటున్నారు. కానీ పెద్ది లెనిన్ ని వదలడం లేదు.
ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అయిన పెద్ది చిత్రాన్ని జూన్ 4 లేదా జూన్ 25 కి విడుదల చేస్తే బావుంటుంది అని మేకర్స్ అనుకున్నా జూన్ 4 కి పెద్ది ని తేవడం ఇంపాజిబుల్ అవడంతో ఆ జూన్ 25 కె పెద్ది మేకర్స్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. లెనిన్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే జాన్ 4 న పెద్ది ని విడుదల చెయ్యాలనుకున్నారు.
కానీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ దృష్యా పెద్ది ని జూన్ 4 కి తేవడం కష్టమవడంతో పెద్ది ని జూన్ 25 కి ఫిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు లెనిన్ పరిస్థితి ఏమిటో చూడాలి. నిజంగా లెనిన్ కి పెద్ది పెద్ద తలనొప్పిలా తయారైంది.




సంయుక్త మీనన్ న్యూ లుక్ 
Loading..