Advertisementt

మళయాళమే కాదు తెలుగులోనూ వాలా 2 హిట్టే

Fri 24th Apr 2026 09:18 AM
vaazha 2  మళయాళమే కాదు తెలుగులోనూ వాలా 2 హిట్టే
Vaazha 2 premiere talk మళయాళమే కాదు తెలుగులోనూ వాలా 2 హిట్టే
Advertisement
Ads by CJ

కొన్నేళ్లుగా భాష ఏమిటి అనేది ఆడియన్స్ పట్టించుకోవడం మానేశారు. ఒక సినిమా ఏ భాషలో హిట్ అయినా తెలుగు ఆడియన్స్ ఆ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. అందుకే పాన్ ఇండియా భాషల్లోని చాలా హిట్ సినిమాలు డబ్ అయ్యి తెలుగులో విడుదలవుతున్నాయి. వాటిని తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి వాలా 2 చేరింది.

చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి మలయాళ థియేటర్స్ లో రూ.200 కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన వాలా 2 చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి ఈరోజు ఏప్రిల్ 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వాలా 2 చిత్రాన్ని మీడియా కోసం ఒకరోజు ముందే ప్రీమియర్ వేసి చూపించారు మేకర్స్.

వాలా 2 చిత్రాన్ని చూసిన మీడియా పీపుల్ ఫస్ట్ హాఫ్ యూత్‌ఫుల్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి, ఇక వాలా 2 కి గుండెకాయ క్లైమాక్స్. సినిమా లాస్ట్ 30 నిమిషాలు గుండెలు మెలిపెట్టేసేలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వాలా 2 కేవలం యూత్ కే కాదండోయ్, ఫ్యామిలీ తో కలిసి చూసే చిత్రం.. అంటూ ట్వీట్లు వేస్తున్నారు.

మరి వాలా 2 మళయాళంలోనే కాదు తెలుగులోనూ హిట్ కొట్టేసినట్లే అనిపిస్తుంది. చూద్దాం వాలా 2 తెలుగు పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అనేది.

Vaazha 2 premiere talk:

Vaazha 2  social media talk

Tags:   VAAZHA 2
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ