పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ చేసి మేకర్స్ కొత్త డేట్ అంటే జూన్ 4 విషయంలో కాన్ఫిడెంట్ గా లేరా.. అందుకే కొత్త విడుదల తేదీ ని ప్రకటించకుండా వెయిట్ చేయిస్తున్నారు. ముందు జూన్ 25 అనుకున్నప్పటికీ అఖిల్ లెనిన్ కి అడ్డు తగలడం ఇష్టం లేని మేకర్స్ జూన్ 4 కి పెద్ది వరల్డ్ వైడ్ రిలీజ్ అనుకుంటున్నారనే ప్రచారం జెరిగింది.
కానీ పెద్ది మేకర్స్ ఆ డేట్ ని ఎనౌన్స్ చేసేందుకు ఎందుకో తెగ ఆలోచిస్తున్నారు. మరో ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ ఫినిష్ అంటూ రెండు రోజుల క్రితమే బిగ్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్ షూటింగ్ అయిపోయినా రిలీజ్ డేట్ ఎందుకు లేట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు. ఒకవేళ రెహమాన్ ఆర్.ఆర్ లేట్ అవుతుంది అనా..
పాన్ ఇండియా మూవీ అయ్యుండి ఇలా రిలీజ్ డేట్ మీద కాన్ఫిడెన్స్ లేకపోతె ఎలా. మరి పెద్ది మేకర్స్ పెద్ది విడుదల తేదీ విషయంలో ఎప్పుడు స్పష్టత ఇస్తారో చూడాలి.




గ్లోబల్ స్థాయిలో AA23
Loading..