నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న NBK 111 చిత్రంలో నయనతార హీరోయిన్. నయనతార తో పాటుగా బాలయ్య కోసం డింపుల్ హయ్యతి ని కూడా గోపిచంద్ మలినేని సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారనే టాక్ నడిచింది.
ఆతర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ లోకి సెకండ్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ చేరింది. అయితే డింపుల్ కి బాలయ్య కాదు ఛాన్స్ ఇచ్చింది చిరు అంటూ మరో న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మెగా 158 లో డింపుల్ హయ్యతి పేరు వినబడుతుంది.
మెగా 158 లో ప్రియమణి హీరోయిన్. ఆమెతో పాటుగా డింపుల్ కనిపిస్తుంది అని, డింపుల్ హయ్యతి ది హీరోయిన్ పాత్ర కాదు అని, ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది అని తెలుస్తోంది. సో బాలయ్య తో అన్నా మెగాస్టార్ చిరు డింపుల్ హయ్యతి కి ఛాన్స్ ఇచ్చారన్నమాట.




ఎమ్మెల్సీగా బిజీ అవుతారనుకుంటే జబర్దస్త్ లోకి
Loading..