ఈటివి లో ఒక్కప్పడు తెగ ఫేమస్ అయిన కామెడీ షో జబర్దస్త్ ఇప్పుడు మసకబారింది. కామెడీ షో లో ఒకప్పుడు ఉన్న కమెడియన్స్ ఎవరూ ఇప్పుడు కనిపించడం లేదు, అప్పట్లో పేలిన జోక్స్ ఇప్పుడు పేలడము లేదు. కామెడీ షోస్ కి రారాజుగా నిలిచిన జబర్దస్త్ ని ఇప్పుడు పట్టించుకునే ప్రేక్షకులే లేరు అంటే నమ్మాలి.
అంతేకాదు అప్పట్లో నాగబాబు, రోజా జెడ్జి లుగా కమెడియన్స్ తో పాటుగా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేవారు. అందులో ముందుగా నాగుబాబు జబర్దస్త్ ని వదిలేస్తే రోజా మినిస్టర్ అయ్యాక జబర్దస్త్ ని వదిలేసింది. ఆతర్వాత రకరకాల జెడ్జి లు మారారు, మారుతున్నారు. ఇక నాగబాబు రీసెంట్ గా పొలిటికల్ గా ఎమ్మెల్సీ పదవి చేపట్టారు, ఆతర్వాత ఆయన మంత్రి అవుతారన్నారు.
నాగబాబు ఎమ్మెల్సీ గా బిజీ, ఇకపై ఆయన బుల్లితెర పై కనిపించరనుకుంటే నాగబాబు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. నాగబాబు మళ్లీ జడ్జ్‌గా చైర్‌లో కూర్చున్నారు. ఎంత మంది వచ్చినా, ఎంత మంది కూర్చున్నా.. ఆ ఛైర్ ఎప్పటికీ మీదే అని నాగబాబు గురించి యాంకర్ రష్మీ కామెంట్ చేసింది.
ఇక నాగబాబు కూడా జబర్దస్త్ ని పొగడడం నిజంగా హైలెట్ అయ్యింది. ఒకప్పుడు విమర్శలు చేసిన నాగబాబు మళ్లీ జబర్దస్త్ ని పొగడడం ఏమిటో, ఎమ్మెల్సీగా బిజీ అవుతారనుకుంటే జబర్దస్త్ లోకి వచ్చారు మరి నాగబాబు డల్ అయిన జబర్దస్త్ ని పైకి లేపుతారేమో చూడాలి.




హాట్ టాపిక్ గా కల్కి 2 ఇంటర్వెల్ ఎపిసోడ్
Loading..